బ్లూ టంగ్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
మేడిపల్లి / భీమారం ( జగిత్యాల జిల్లా ) : గోవిందారం గ్రామంలో పశు వైద్య పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు బ్లూ టంగ్ (నీలినాలుక/సొల్లు) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ అధికారులు మాట్లాడుతూ... బ్లూ టంగ్ వ్యాధి నుంచి గొర్రెలను రక్షించడానికి టీకాలు అత్యంత ప్రభావవంతమైనవని, గ్రామంలోని ప్రతి గొర్రెల పెంపకందారుడు తమ గొర్రెలకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని, పశుసంపదను సంరక్షించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడవచ్చని, ఇటువంటి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు అందరూ సహకరించాలని పశు, గొర్రెలా పెంపకందారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లూరి ఉమారాణి-దేవయ్య, పశువైద్య అధికారి డాక్టర్ బద్దం రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మల్లేశం, సత్తవ, రైతులు, పశు, గొర్రెల పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 41
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
