శాశ్వత పరిష్కారానికే 'భూభారతి' రీ సర్వే : ఎమ్మార్వో

శాశ్వత పరిష్కారానికే 'భూభారతి' రీ సర్వే : ఎమ్మార్వో

నాగార్జునసాగర్ ; మండల పరిధిలోని సంగరాం గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈసం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా పెద్దవూర ఎమ్మార్వో బి.ఖాసీం హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా ప్రతి భూభాగానికి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.అధునాతన సాంకేతికత మరియు డ్రోన్ల సహాయంతో జరిగే ఈ డిజిటల్ రీ సర్వే ద్వారా రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.ప్రతి భూమికి జీపీఎస్ ఆధారిత ల్యాండ్ మ్యాప్,యూనిక్ ఐడీ కేటాయింపు.సరిహద్దు తగాదాలు పూర్తిగా తొలగి పోవడం,డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు అడ్డుకట్ట పడటం.భూమి కొలతలు పూర్తయ్యాక అప్డేట్ చేసిన డిజిటల్ పత్రాలను ఆన్లైన్ పోర్టల్లో నేరుగా చూసుకునే సదుపాయం.సర్వే నిర్వహించే సమయంలో రైతులు,గ్రామస్తులు స్వయంగా హాజరై,లైసెన్స్డ్ సర్వేయర్లకు సహకరించి తమ భూముల రికార్డులను,యాజమాన్య హక్కులను సరిచూసుకోవాలని ఎమ్మార్వో సూచించారు.గ్రామ రెవెన్యూ యంత్రాంగం సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తుందని,రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి,గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ