నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించాలి
మిస్ అండ్ మిసెస్ ఉమెన్స్ క్లాత్ షోరూంను ప్రారంభించిన జనంపల్లి పురేందర్ రెడ్డి
కూకట్ పల్లి :కేపీహెచ్‌బీ కాలనీ మెయిన్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్ అండ్ మిసెస్ ఉమెన్స్ క్లాత్ షోరూంను రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు అభిలాష్ రెడ్డి, జయంత్ కుమార్, వీవీ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆకర్షణీయమైన ధరలతో పాటు నాణ్యమైన దుస్తులను అందించడం ద్వారా వినియోగదారుల ఆదరణ పొందాలని షోరూం యజమానులకు తెలిపారు. వ్యాపారంలో మంచి పేరు సంపాదిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి. నర్సింగ్ రావు, శ్రీధర్, జి. ప్రసాద్, గణేష్, మురళి తదితరులు పాల్గొని షోరూం యజమానులకు అభినందనలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


