550 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ : నిర్ణీత గడువులోగా 550 పడకల ఆసుపత్రి పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమం నిర్మాణాన్నిత్ కేశవ్ పాటిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్ పనులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని, నిర్మాణ సామగ్రి నాణ్యతను, పనుల ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు. వారి వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.డి. సులేమాన్, ఇంజనీరింగ్ అధికారి సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Oct 2026 15:02:09
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో...
