వెన్నచేడ్ మోడల్ స్కూల్లో క్లాట్ కోచింగ్‌కు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
గండీడ్ మండలం వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు పార్ట్‌టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీని నియమించనున్నారు.ఈ పోస్టులకు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం లేదా సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు రోజుకు రెండు గంటల పాటు బోధించాల్సి ఉంటుంది. ఇందుకు గంటకు రూ.600 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు.విద్యార్థులకు సిలబస్ ప్రకారం బోధించడంతో పాటు ప్రాక్టీస్ టెస్టులు, అసైన్మెంట్లు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటుందని, దీనివల్ల రెగ్యులర్ ఉద్యోగానికి ఎలాంటి హక్కులు లభించవని పాఠశాల ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 17, 18 తేదీల్లో వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పూర్తి వివరాల కోసం పాఠశాల ను సంప్రదించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


