కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎

కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎

కోయిలకొండ : ‎ ‎కొయిలకొండ మండల కేంద్రంలో బుధవారం సీసన్ ‎ విద్యార్థుల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ క్రీడా వేడుకను ఏర్పాటు చేశారు. ‎​ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి (MEO) శ్రీ మిన్హాజుద్దీన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులను అభినందించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగ పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి, క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.​పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, కొయిలకొండ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం మొగులయ్య, గంగ్యా నాయక్, ప్రత్యేక ఉపాధ్యాయులు, సీఆర్పీలు శంకర్ యాదవ్, వెంకటేశ్వర్ గౌడ్, హర్ష కుమార్, ఐఈఆర్పీ మన్యమయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎ కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
కోయిలకొండ : ‎ ‎కొయిలకొండ మండల కేంద్రంలో బుధవారం సీసన్ ‎ విద్యార్థుల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన...
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం
ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ