ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ

మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ

ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ

హుస్నాబాద్‌ : ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల పూజ సూచించారు.ఈ సందర్బంగా బుధవారం రోజున సర్పంచ్ రిక్కల లత రాజిరెడ్డి ఆధ్వర్యంలో బంజేరుపల్లి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం, వేప ఆధారిత కషాయాల వినియోగం, పశువుల ఎరువు, పంట అవశేషాలు, పచ్చిరొట్ట ఎరువులు, అంతర పంటలు, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చని వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో నేలలో సూక్ష్మజీవుల చైతన్యం, తేమ నిలుపుకొనే సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. రైతులు తొలుత తమ పొలాల్లో కొంత విస్తీర్ణంలో ఈ పద్ధతులను అమలు చేసి, అనుభవం ఆధారంగా విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్‌, ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రశాంత్‌, గ్రామ సర్పంచ్‌, రైతులు రిక్కల రాజిరెడ్డి, బాణాల శంకర్‌రెడ్డి, నందరెడ్డి, ఇప్ప నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం