పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
చౌటకూర్ : శివంపేట పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు శివంపేటలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఉపయోగించలేని ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, వాటిని ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఈ-వేస్ట్‌ను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు మల్లేశంతో పాటు ఉపాధ్యాయులు ఎన్. రాములు, ఎస్. రాములు, ముకుందం, మజీద్, మాణిక్యం, శైలజ, స్వప్నశ్రీ, సునీత బాయి, సునీత వేణి, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన పొందారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

