వడ్డెర కాలనీలో అక్రమ బెల్టు షాపులపై మంచిర్యాల పోలీసుల ఆకస్మిక దాడులు
మంచిర్యాల : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆది మధుసూదన్, పోలీసు సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వడ్డెర కాలనీకి చెందిన
ఒల్లెపు కుమార్, యైదా లక్ష్మణ్, ఎడగొట్టు పున్నం,
వల్లెపు సాయి కుమార్, నలుగురు వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ. 40,000 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

