బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా

అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా

బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా

మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజం
నిజామాబాద్ అక్టోబర్27:( విజన్ ఆంధ్ర) ఇందూరులో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ఆర్ఓబిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. నగర శివారులోని మాధవనగర్ ఆర్ వోబీ పనుల జాప్యంపై మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తాను ఇక్కడకి ఎమ్మెల్యేగా కాదని, మీలో ఒకడిగా మీ బాధను పంచుకోవడానికి వచ్చానన్నారు. 
ఈ మాధవ్ నగర్ గేటుతో నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. 
నిత్యం ఈ రోడ్డు మీదుగా అన్ని రకాల వాహనాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. అలాగే ప్రతిరోజు 24 గంటల్లో 58 రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రతిసారి  15 నుంచి 20 నిమిషాల వరకు గేటు పడటం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రధానంగా ఈ సమస్యతో స్కూల్ పిల్లలు స్కూల్ కి లేట్... కూలీలు పనికి లేట్..రోగులు హాస్పిటల్ కి లేట్... ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగానికి లేట్... చివరికి శవాలు కూడా స్మశానానికి లేట్ గా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ వోబీ కొరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి కేంద్ర నిధులు మంజూరు చేయించారన్నారు. రైల్వే శాఖ తనవంతు పని పూర్తి చేసిందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 
మాధవ్ నగర్ ఆర్ఓబిపై ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గత ఏడాది కలిస్తే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు గుర్తు చేశారు.కానీ ఇప్పటివరకు ఎందుకు పూర్తి కావడం లేదన్నారు. ఇది నిజామాబాద్ అర్బన్ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కనుకయ్య గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కనుకయ్య
  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి  కాంగ్రెస్ గ్రామ శాఖ ఎన్నికలు మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్, సర్పంచ్ పాండ్రాల దాము ఆధ్వర్యంలో  సోమవారం నిర్వహించారు.
పాఠశాలలో విద్యార్థులకు షూస్, సాక్సుల పంపిణీ
ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
బాల్కొండ అభివృద్ధికి సీతక్క భరోసా!
బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా
జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సిఏ కొత్త బాడీ సభ్యులకు, హాఫిజ్ పేట శెట్టిబలిజ సంఘం వారు ఘన సన్మానం
కొంపల్లిలో ఘనంగా ఎస్‌వీఎం గ్రాండ్ ప్రారంభోత్సవం