ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్
మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా 130 మంది లబ్ధిదారులకు రూ.50,53,700 విలువైన CMRF చెక్కుల పంపిణీ చేశారు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్ మరియు హాజీపూర్ ప్రాంతాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.50,53,700/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారికి అండగా నిలబడటమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

