బాల్కొండ ప్రెస్ క్లబ్ కు గ్రామ పంచాయతీ భూమిని కేటాయించాలని విజ్ఞప్తి
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) : ఆర్. సి. ఇంచార్జి నవంబర్ 23:- నిజామాబాదు జిల్లా బాల్కొండ భూ కబ్జాలకు పెట్టింది పేరు, కోట్ల విలువ చేసె ప్రభుత్వ భూమి(గ్రామ పంచాయతీ భూమి) కొందరు నాయకులు ఆక్రమించి అక్రమ నిర్మాణం చేస్తున్నారు.ఇట్టి గ్రామ పంచాయతీ ఓపెన్ స్థలాన్ని ప్రెస్ క్లబ్ భవన నిర్మా ణానికి కేటాయించాలని బాల్కొండ ప్రెస్ క్లబ్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ లైన సాయ గౌడ్, కాలమిస్ట్ చరిత్ర కారులు బి. ఆర్. నర్సింగ్ రావు కలసి నిజామాబాదు జిల్లా కలెక్టర్ ప్రజా వాణి లో లేఖ నేం.తో 08/2026,తేదీ 09 - 11 - 2026 రోజున,అలాగే తెలంగాణ ముఖ్య మంత్రి కార్యాలయంలోని ముఖ్య మంత్రి సహాయ కార్యదర్శి కే. వెంకటేశ్వర్ రావు గారికి లేఖ నేం.తో 08/2026, తేదీ 16-11-2026 రోజున వినతి పత్రాన్ని సమర్పిం చారు.ఈ భూమికి సంబదించి న వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కి చెందిన భూమి సర్వే నం 1340 & 1342 లో వెంచర్ చేయడాని పూర్వ గ్రామ పంచాయతీ కార్య నిర్వాహాక అధికారి గులాం మహ్మద్ హయాంలో ఆనాటి గ్రామ పంచాయతీ తీర్మానం తర్వాత బాల్కొండ జీ. పి. లేఖ నేం 78/74,తేదీ10-09-1974, నోట్ ఫైల్ ను పూర్వ జిల్లా కలెక్టర్ బి. కే. పెంటయ్య, ఐ. ఏ. ఎస్, ఎల్. డిస్ / నేం 5853/1974 తేదీ 20-12-1974, ప్రకారంగా వెంచర్ చేసి వేలం పాట ద్వారా ప్లాట్స్ విక్రయించగ రాళ్లతో కూడిన మిగులు భూమిని "ఓపెన్ ప్లేస్ " గ మార్క్ చేసిన స్థలాలను ఉంచారు.ప్రస్తుత గ్రామ పంచాయతీ వారు జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా అధికారం ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు " ఫేక్ డాక్యుమెంట్ " సృష్టించి థర్డ్ పార్టీ ద్వారా క్రయ విక్రయాలు జరిపి అదే " ఫేక్ డాక్యుమెంట్ తో " ఫేక్ రిజిస్ట్రేషన్ చేసికొని కోట్లాది రూపాయల విలువ చేసె భూమిలో ఏలా అక్రమ నిర్మాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామ పౌరులు ఆందోళన చెందు తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని గ్రామ పంచాయతీ ఓపెన్ స్థలo తో పాటు అక్రమ నిర్మాణ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కేటా యించాలని బాల్కొండ ప్రెస్ క్లబ్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ లు కోరుచున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


