*ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ప్రజల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

*ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ బ్యూరో  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజలకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖేలో ఇండియా క్రీడా పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా నుంచి ప్రత్యేక క్రీడా బృందాన్ని పోటీలను తిలకించేందుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దీనివల్ల క్రీడాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి, స్ఫూర్తి మరింత పెరుగుతుందన్నారు. క్రీడా పోటీలు ముగిసే డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత క్రీడా పాఠశాలలు, డీబీడీ కాంప్లెక్స్ మైదానం, ఏటీడీపీ పాఠశాల హాళ్లలో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్తు, డీఆర్వో స్రవంతి, క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

*ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ రాజర్షి షా *ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా...
PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు