ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లా  :  తేదీ 22.11. 2026 ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్లో తెలకపల్లి మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి, పిఈటి బాలయ్య తెలిపారు. వీరిలో అండర్ 16 బాలికల విభాగంలో 8వ, తరగతి విద్యార్థి ఎం. మధుప్రియ 80 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, T.వైష్ణవి 8వ, తరగతి అండర్ 14 బాలికల విభాగంలో జావలిన్ త్రో ప్రథమ స్థానం,T. తేజశ్రీ 7వ, తరగతి అండర్ 12 బాలికల విభాగంలో 80 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, M. నిక్షిత 7వ తరగతి అండర్ 12 బాలికల విభాగంలో 150 మీటర్ల పరుగు పందెం లో ప్రథమ స్థానం,B. గౌతమ్ రాజ్ 7వ తరగతి అండర్ 12 బాలుర విభాగంలో లాంగ్ జంప్ ప్రథమ స్థానం, A. నరేందర్ 6వ తరగతి అండల్ 12 బాలుర విభాగంలో 80 మీటర్స్ పరుగు పందెంలో ప్రథమ స్థానం,D.కావ్య 6వ తరగతి అండర్ 12 విభాగంలో లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, B. చైతన్య 6వ తరగతి అండర్ 10 బాలికల విభాగంలో 80 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, M. భవాని 6వ తరగతి అండర్ 10 బాలికల విభాగంలో లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం,C. అక్షిత్ గౌడ్ 7వ తరగతి అండర్ 12 బాలుర విభాగంలో 150 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం లో ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. 30.11.2026 నుండి 01.12.2026 వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలకపల్లి మండల MEO శ్రీ G. నరహరి మరియు ఆలేరు ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ C. బచ్చన్న , ఫిజికల్ డైరెక్టర్ శ్రీ A. బాలయ్య ఉపాధ్యాయ బృందం మరియు ఆలేరు గ్రామ సర్పంచ్ T.ఆనంద్ , అలాగే పాఠశాల AAPC చైర్ పర్సన్ శ్రీమతి అమృతమ్మ , మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు విద్యార్థుల ఎంపిక పట్ల అభినందించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
నాగర్ కర్నూల్ జిల్లా  :  తేదీ 22.11. 2026 ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్...
*ఖేలో ఇండియా క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర