దీపావళి పండుగ నేపథ్యంలో టెంపర్వరి ఫైర్ వర్క్స్ లైసెన్స్ నిమిత్తము

క్రాకర్స్ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి , భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదు

దీపావళి పండుగ నేపథ్యంలో టెంపర్వరి ఫైర్ వర్క్స్ లైసెన్స్ నిమిత్తము

 పోలీస్ కమిషనర్ వెల్లడి

 నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు హోల్ సెల్ షాపుల యాజమాన్యాలతో సోమవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో  నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ బాణసంచా విక్రయాలు నిర్వహించే ప్రతి షాపు యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని , సంబంధిత శాఖల నుంచి అవసరమైన లైసెన్సులు పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని స్పష్టం చేశారు.
షాపుల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని , అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని , విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు నిర్వహించినా , భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత షాపు యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

🔷తప్పనిసరిగా ఉండవలసినవి:
* లైసెన్స్ కాపీ దుకాణం ముందు కనిపించేలా ఉండాలి.
* 2 అగ్నిమాపక యంత్రాలు , 2 ఇసుక బకెట్లు , 2 నీటి బకెట్లు
* "పొగ త్రాగడం నిషేధం - NO SMOKING" బోర్డు

🔷నిషేధించబడినవి
* దుకాణంలో పొగ త్రాగడం , అగ్గిపుల్ల , లైటర్ , వంట చేయడం పూర్తిగా నిషేధం
* 18 సంవత్సరాల లోపు పిల్లలకు బాణాసంచా అమ్మకూడదు
* రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు దుకాణం మూసివేయాలి.
* దుకాణం దగ్గర టపాసులు కాల్చి చూపించకూడదు

🔷అత్యవసర సంప్రదింపు పోలీస్ - 112 / ఫైర్ - 101

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ ప్రాధాన్యత అని , వ్యాపారులు పోలీస్ శాఖకు సహకరిస్తూ సురక్షిత వాతావరణంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్  సూచించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసిపి  ప్రకాష్  , నిజామాబాద్ టౌన్ సిఐ  సత్యనారాయణ ,  నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి , నిజామాబాద్ టౌన్ 1 ఎస్.హెచ్.ఓ శ్రీనివాస్  ,  2 టౌన్ ఎస్సై  యాదగిరి గౌడ్ , 3  టౌన్ ఎస్ఐ  హరిబాబు  ,  4 టౌన్ ఎస్సై 2 సాయన్న  , 5 టౌన్ ఎస్ఐ  సునీల్ మరియు పాలిటెక్నిక్  క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  పేట సంతోష్  , సెక్రెటరీ  పసుమర్తి ప్రవీణ్  , క్యాషియర్ బొంపల్లి రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే