శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి సతీమణి లలిత

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి సతీమణి లలిత

మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బ్రాహ్మణ వాడాలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్బంగా జరిగిన లక్ష పుష్పార్చన మరియు దీపోత్సవ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వాకిటి శ్రీహరి సతీమణి శ్రీమతి వాకిటి లలిత పాల్గొన్నారు.లక్ష్మి వెంకటేశ్వర ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణి వాకిటి లలితమ్మ కు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. కార్తీక మాసం సందర్బంగా మక్తల్ మున్సిపాలిటీలో ని 13 వ వార్డ్ బ్రాహ్మణ వీధిలో వెలసిన లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన లక్ష పుష్పర్చన, దీపారాధన కార్యక్రమం లో పాల్గొనడం చాలా భక్తి,సంతోషం ను కలిగిందని,కార్తీక దీపాలు వెలిగించడం వలన ప్రజల విజ్ఞాలు తొలిగి మంచి జరుగుతుందని, ప్రజలందరు కార్తీక మాసం లో పూజలు చేయడం వలన అందరు సుఖ శాంతులతో ఉంటారని, ప్రజలందరు ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం తో ఆయురారోగ్యాలతో సుఖ : శాంతులతో ఉండాలని వాకిటి లలిత ఈ సందర్బంగా తెలిపారు. కార్యక్రమం అనంతరం మంత్రి సతీమణి కి ఆలయ చరిత్ర తెలిపి స్వామి వారి తీర్తప్రసాదాలు అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకిటి మానస, బ్రాహ్మణ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!