ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి
నిజామాబాద్ : ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన బోధన్ మండలంలో చోటు చేసుకుంది. బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది . బోధన్ డిపోకు చెందిన బస్సు బికినీల్లి నుండి బోధన్ వస్తుండగా సిద్దాపూర్ వద్ద శేష భాయ్ అనే వృద్ధురాలు బస్సు దిగే క్రమంలో కింద పడిపోయింది. దీంతో బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
26 Nov 2026 19:19:01
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ; సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
