మానాధ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
వృద్ధులకు అన్నదాన కార్యక్రమం
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం నర్మాల బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి రాజేందర్. తన పుట్టినరోజు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు.ఆకునూరి రాజేందర్ మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం, వారితో ఆప్యాయంగా కొంత సమయం గడపడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా విందులు, వినోదాలకు పెట్టే ఖర్చులో కొంత భాగమైనా నిరుపేదలు, అనాథలు, వృద్ధుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడబోయిన రాజు,నాయకులు ఎగదండీ స్వామి, పంపరి మహేష్, గుండెల్లి కళ్యాణ్, దాసరి చెంద్రం తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

