చౌటకూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’

* 14 గ్రామాల్లో చేపట్టిన ప్రగతి పనులను ప్రజలకు వివరించేందుకే యాత్ర * నియోజకవర్గానికి రూ.2,000 కోట్ల నిధులు తెచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ: మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి * రిబ్బన్ కట్ చేసి రథయాత్రను ప్రారంభించిన నాయకులు

చౌటకూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’

చౌటకూర్:
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి రథయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. మంత్రి ప్రత్యేక చొరవతో నియోజకవర్గానికి సుమారు రూ.2,000 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయని, వాటితో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.చౌటకూర్ సర్పంచ్ పర్కాల రాంరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, మండల పరిధిలోని మొత్తం 14 గ్రామాల్లో జరిగిన ప్రగతిని ఈ రథయాత్ర ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ రథయాత్ర పర్యటిస్తుందని, ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అంకితభావంతో చేసిన కృషి ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్కల రాంరెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, గోరెమియా, పేట గంగారం, మాజీ ఉపసర్పంచ్ రామా గౌడ్, కరోబార్ కుమార్ గౌడ్, మల్లేశం, దమ్మి కిట్టు, చక్రపాణి, రాజేశ్వర్ గౌడ్, మల్లికార్జున్, బాలు, నవీన్, రాజులతో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్: 20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్:
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : అకస్మాత్తుగా మాట కోల్పోవడం,కుడిచెయ్యి, కుడికాలు కదలకపోవడం వంటి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన 20 ఏళ్ల యువతికి హైదరాబాద్ మలక్ పేట్...
SIRపై అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలు వివరించాలి
కరువు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష: ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
జుక్కల్‌లో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపలేని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
చౌటకూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’