దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మరాఠి నాగరాజు

దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మనోహరాబాద్ : రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా, పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దండుపల్లి సర్పంచ్ మరాఠి నాగరాజు, ఏపీఎం సత్యనారాయణ సూచించారు.మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ధాన్యం విక్రయ ప్రక్రియలో రైతులు నిబంధనలను పాటిస్తూ, కొనుగోలు కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పంటను విక్రయించే సమయంలో రైతులకు అవసరమైన సహకారం అందించాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు కిషన్ నాయక్, మమత, మంజుల, గ్రామ సంఘం ఓబీ ఉమారాణి, నాయకులు బిక్షపతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం