అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలి: వి. హనుమంతరావు.
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అంబర్‌పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో మూడు రోజుల పాటు శ్రీ వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ యాగాలను చేపట్టారు.
ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని, పంటలు సమృద్ధిగా పండాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. జలాశయాలు నిండటంతో పాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో యాగాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ మహంకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. లోకకల్యాణం, రాష్ట్ర సుభిక్షం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


