పోచమ్మ ఆలయాన్ని పట్టించుకోని కాంట్రాక్టర్.. భక్తుల్లో ఆగ్రహం

పోచమ్మ ఆలయాన్ని పట్టించుకోని కాంట్రాక్టర్.. భక్తుల్లో ఆగ్రహం

ములుగు, నవంబర్ 27 : ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుండి వందలాది మంది ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వారందరికీ ఆధ్యాత్మికంగా అండగా నిలిచే బస్ స్టాండ్ పోచమ్మ ఆలయం మాత్రం నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న స్పందిస్తూ, బస్ స్టాండ్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ ఆలయాన్ని పెద్దగా నిర్మించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ హామీని పూర్తిగా మరిచిపోయి, “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లు ఆలయాన్ని అలాగే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులు, స్థానికులు నిత్యం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయినా ఆలయం వద్ద కనీసం షెడ్ లేక ఎండకు, వానకు భక్తులు ఇబ్బంది పడుతున్నారని, మంచినీటి సౌకర్యం, లైటింగ్, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి మౌలిక సౌకర్యాలు కూడా లేవని ఆయన వివరించారు. పండుగలు వచ్చాయంటే మొదటి ముద్ద పోచమ్మ తల్లికేనని, మొదటి బోనం వండి నైవేద్యం సమర్పించి, “ఇంటిల్లిపాదిని చల్లగా చూడమ్మా” అని వేడుకుంటామని భక్తులు చెబుతున్నారు. అంతటి నమ్మకంతో కొలిచే పోచమ్మ తల్లి ఆలయానికి మాత్రం అభివృద్ధి నోచుకోకపోవడం ఎంతో బాధాకరమని రాజన్న అన్నారు. భక్తుల విశ్వాసంతో, మనోభావాలతో ఆడుకోవడం సరికాదని, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆలయానికి అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. లేనిపక్షంలో భక్తులను కలుపుకొని ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
హుస్నాబాద్  :  AISF ఆధ్వర్యంలో చేపట్టిన “మన బడి – మన హక్కు” కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత...
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
సైనిక స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: