ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
భూపాలపల్లిలో బస్సులకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్
భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో నిర్వహించనున్న “ఓటు బచావో – దేశ్ బచావో” భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల బస్సులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో, పట్టణ కాంగ్రెస్ నాయకులు,దేవన్ ప్రేమ్, రాజేష్, సురేష్, కిషోర్, సురేష్, సుభాష్, అశోక్, నవీన్, ప్రసాద్, రత్నాకర్, కౌన్సిలర్లు,రాజు, సాయి,అఖిల్ మండల ఇస్తారీ, జిల్లా నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


