అర్హులైన ప్రతి పెద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఫ్రొసీడింగ్ లు అందజేత - మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.దిగంబర్ రావు *పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం - సర్పంచ్ ఆనందం
రేగోడు (మెదక్ ): రేగోడు మండలం టి.లింగంపల్లి గ్రామానికి రెండవ విడతలో భాగంగా 18 ఇందిరమ్మ ఇళ్ళును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సహకారంతో మంజూరు చేసుకోవడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్. దిగంబర్ రావు అన్నారు. మంత్రి ఆదేశాలతొ గ్రామ సర్పంచ్ ఆనందం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు దిగంబర్ రావు మాట్లాడుతూ మంత్రి దామోదర్ రాజనర్సింహా సహకారంతో గ్రామంలో ఉన్న అర్హులైన ప్రతి పెద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యం మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.అనంతరం సర్పంచ్ ఆనందం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఫ్రొసీడింగ్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్స్టీ సెల్ అధ్యక్షులు పిర్యా నాయక్,పిఏసిఎస్ డైరెక్టర్ శివాజీ రావు,వార్డు సభ్యులు కిష్టమ్మ, సంధ్య రాణి,గ్రామ యూత్ అధ్యక్షులు చంద్రయ్య,నాయకులు నజీర్,శాంసుందర్,మల్లేశం,మైతాబ్,ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


