ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి

ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి

ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి

ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మనోహరాబాద్ మండల ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మండలంలోని దండుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మరాఠి నాగరాజు అధ్యక్షతన ఎల్నినో ప్రభావంపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, విద్యుత్‌ వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. నీరు, విద్యుత్‌ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు.ఎల్నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గ్రామస్థులు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తూ, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

లింగన్నపేట లోఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం లింగన్నపేట లోఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
గంభీరావుపేటమండలంలోని లింగన్నపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ హరి హర దేవాలయం నుండి శ్రీ...
తాటిగూడ మోడల్‌ స్కూల్‌లో అల్పాహార పథకం పరిశీలన
టాటా మ్యాజిక్ నూతన కార్యవర్గం ఎన్నిక
మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
400 మంది రక్తదానం.. అమరవీరులకు ఘన నివాళి
24 గంటల్లో మర్డర్ కేసు నిందితుని పట్టివేత