లింగన్నపేట లోఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
గంభీరావుపేటమండలంలోని లింగన్నపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ హరి హర దేవాలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామిని రథం పైన పురవీధుల గుండా ఊరేగించారు. రథోత్సవం ముందు కోలాటాలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి రథోత్సవంలో పాల్గొని మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు, కట్న కానుకలు సమర్పించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రథోత్సవం లో పాల్గొని స్వామివారినీ దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వేద పండితులు రాధాకృష్ణశర్మ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, వైస్ చైర్మన్ మేడ భాస్కర్ తో పాటు పలువు నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


