తాటిగూడ మోడల్ స్కూల్‌లో అల్పాహార పథకం పరిశీలన
కాసిపేట మండలం తాటిగూడ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు తీరును గ్రామ సర్పంచ్ మడావి వెంకటేష్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేసి, స్వయంగా రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటూ వారితో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా చదువుపై ఏకాగ్రత పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన అల్పాహారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మంగ రమాదేవి, వంట సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


