24 గంటల్లో మర్డర్ కేసు నిందితుని పట్టివేత
పర్వతగిరి మండలంలోని మాల్యతండా గ్రామ పరిధిలోని హర్జతండా లో భర్త వేరే మహిళతో అక్రమ సంబందం పెట్టుకొని భార్య అడ్డుగా వున్నదని భార్య యొక్క గొంతు నులిమి మరియు ఉరివేసి చంపి, నిందితుడు దానిని ఆక్సిడెంట్ లా చిత్రీకరించాలకున్న సంఘటన.
నిందితుడు: పాల్తియ బాలు S/o పూల్య, వయసు: 63 సం.లు, కులము: లంబాడ, వృత్తి: వ్యవసాయం, R/o హార్జతాండ H/o మాల్యాతాండ గ్రామం, పర్వతగిరి మండలం
మృతురాలు : పాల్తియ పూలమ్మ w/o బాలు, 53 సం. లు, కులం: లంబాడ, వృత్తి: వ్యవసాయం R/o హార్జతాండ H/o మాల్యాతాండ గ్రామం, పర్వతగిరి మండలం.
నిందితుడైన బాలు మరియు పూలమ్మ, భార్య భర్తలు, వీరికి ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి. ముగ్గురు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో వుంటున్నాడు. బాలు గత పది సంవత్సరాల నుండి నాకొక మహిళతో అక్రమ సంబంధం వుండగా, అట్టి విషయంలో తన భార్య పూలమ్మతో గొడవలు జరిగేవి. గత వారం రోజుల క్రితం దసరా పండుగ ముందు ఉప్పలమ్మ చేసుకుందామని కొడుకు నవీన్ కు ఫోన్ చేసి అమ్మను తీసుకొని ఇంటికి రమ్మనగా, నవీన్ తన తల్లిని తీసుకొని హర్జా తండాకు వచ్చినాడు. తేదీ: 24-10-2026 రోజున నిందితుని అక్రమ సంబందం గురించి భార్య భర్తను నిలదీయగా, ఇద్దరి మధ్య గొడవ జరిగినది. నిందితుడు ఏ విధంగానైనా తన భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని రాత్రి అందాజా 07:00 గంటల ప్రాంతంలో భార్యతో గొడవపడి ఆమె గొంతు నులిమి మరియు టవల్ తో ఆమె మెడకు ఉరివేయగా, ఆమె స్పృహకోల్పోగా, చనిపోయిందని అనుకోని అట్టి చావును ఆక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్లాన్ వేసుకొని, నిందితుని ఇల్లు తండా శివారున వుంటుంది కనుక మరియు ఆరోజు ప్రక్క గల గడ్డపార తండా లో ఒకరు చనిపోగా, వారు చావుకు వెళ్ళగా. నిందితుడు ఇంటి నుండి బయటకు వచ్చి, ఎవరైనా వున్నారా, లేదా అని గమనించి, ఎవరు కనిపించక పోవడంతో, అంగీపై వున్న రక్తపు మరకలు ఎవరైనా చూస్తే అనుమానిస్తారని, అంగీని మరియు చంపడానికి ఉపయోగించిన టవల్ ను ఒక కవర్లో పెట్టుకొని తన భార్య ని మోటార్ సైకిల్ నం. TS-24-B-3600 స్ప్లెండర్ ప్లస్ లో పెట్టుకొని, బండి పై ముందు కూర్చోబెట్టి, మీద ఒరిగించుకొని కొంత దూరము ఒక కిలోమీటర్ ప్రయాణించి తండా శివారున లాల్ తండా కు దగ్గరలో బోడ దేవలా అనునతని వ్యవసాయ భూమి వద్దకు చేరుకొని రోడ్ పై బండిని కిందపడేసినాడు . అప్పుడు తన భార్య కొద్దిగా కదిలినట్లు అనిపించగా, ఇంకా చవలేదని అనుమానం వచ్చి, మళ్ళీ భార్య గొంతు నులిమి, ఆమె తలను రోడ్డుకేసి కొట్టినాడు. ఎవరికి అనుమానం రాకుండా వుండడానికి నిందితుడి కుడి కన్ను క్రింద ఒక రాయితో దెబ్బ తాకించుకుని ఆ రాయిని దూరంగా చెట్లలోకి పడవేసినాడు. పోలీస్ వారు ఈ రోజు నిందితుడిని చింతనెక్కొండ వద్ద పట్టుకొని రిమాండ్ కి తరలించనైనది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


