పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో యువత రక్తదానం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో యువత రక్తదానం

బెల్లంపల్లి : పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువ నాయకుడు గొర్ల అఖిల్ సుమారు 20 మంది యువకులతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా యువత సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమనిసీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యువ నాయకుడు గొర్ల అఖిల్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని అన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

*రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా *రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి...
రేపే ప్రారంభం కానున్న ఎస్‌ఎల్‌ఎన్ సౌభాగ్య ప్రీమియా వెంచర్
నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల
బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. పెన్షన్ కట్‌!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటు
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
సింగూరు ప్రాజెక్టు నుంచి 0.15 టీఎంసీల నీటి విడుదల