పోలీస్ అమరవీరుల స్మారకంగా రక్తదాన శిబిరం
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఆర్య వైశ్య భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం అనేది మరొకరికి ప్రాణదానం చేయడంతో సమానమని, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ హనోక్, బెల్లంపల్లి వన్‌టౌన్, టూటౌన్, తాళ్లగురిజాల ఎస్‌ఐలు, 12వ వార్డు కౌన్సిలర్ వాసు, 15వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత పోలీస్ సిబ్బంది, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పట్టణ ప్రజలు యువకులు నాయకులు ఆటో డ్రైవర్ లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


