రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణ ప్రతిజ్ఞ

రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణ   ప్రతిజ్ఞ

కామారెడ్డి బ్యూరో :  కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లో భారతదేశ ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జానకి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News