అమిత్ షా మహా పాదయాత్ర
విజయవంతానికి బీజేపీ సన్నాహాలు నాంపల్లిలో సన్నాహక సమావేశం.. పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి నాయకులకు దిశానిర్దేశం చేసిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు
కల్వకుర్తి : నవంబర్ 2న హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, కర్ణాటక ఇన్చార్జ్ డా. కాసం వెంకటేశ్వర్లు, మంగరి శృతి, శాంతకుమార్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మహా పాదయాత్ర నిర్వహణ, ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, నాయకుల బాధ్యతలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, రాంచందర్ రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజా సమస్యలపై గళమెత్తే లక్ష్యంతో చేపడుతున్న మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


