తిర్లాపురం చెరువులో బోల్తాపడిన గీతాంజలి స్కూల్ టాటా మ్యాజిక్ వాహనం!

ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?

 తిర్లాపురం చెరువులో బోల్తాపడిన గీతాంజలి స్కూల్ టాటా మ్యాజిక్ వాహనం!

మహబూబాబాద్ బ్యూరో : 
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్లపూర్ గ్రామంలో గీతంజలి స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుచు డ్రైవింగ్ చేయటం తో ఒక్కసారిగా వాహనం చెరువు లోకి దూసుకెళ్ళింది. ఆ సమయంలో వ్యాన్ లో  14మంది విద్యార్థులు వున్నారు.  ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెరువు లో నుంచి విద్యార్థుల ను బయటకు తీశారు. అయితే ఇందులో నాల్గురు  విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.అర్హత లేని డ్రైవర్లతోనే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని పలువురు పేర్కొంటున్నారు.
ఇందులో అధికారుల తనిఖీ లోపం స్పష్టంగా కనబడుతోందని ప్రజలు తెలియజేస్తున్నారు.  ప్రమాదాలు జరిగాకే అధికారులు మేల్కొని ఏం లాభం అని ప్రజలు నిలదీస్తున్నారు ? విద్యార్థుల భద్రత గాలికి వదిలేసిన ఆయా పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లా రవాణా శాఖ అధికారుల తీరు పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News