పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
మానవత్వం చాటుకున్న 2005–06 పదో తరగతి, ఏడో తరగతి మిత్రులు
నాంపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో తరగతి చదువుకున్న తోటి విద్యార్థులు. గ్రామానికి చెందిన రాశిక లక్ష్మి గత కొంతకాలంగా పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుబడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, భర్త కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఈ క్రమంలో లక్ష్మి వైద్య ఖర్చులు కుటుంబానికి భారంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తోటి విద్యార్థులు మానవతా దృక్పథంతో స్పందించి, తమ వంతు సహాయంగా రూ.96,500 ఆర్థిక సాయాన్ని వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఆపదలో ఉన్న తమ తోటి విద్యార్థినికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు.లక్ష్మి వైద్య చికిత్సకు మరింత ఆర్థిక సహాయం అవసరమని, దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సాయం అందించి ఆమెను ఆదుకోవాలని తోటి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. సహాయం చేయదలచిన వారు 9701288724 నంబర్‌ను సంప్రదించాలని కోరారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


