జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
పెద్ద శంకరంపేట్ : విజన్ ఆంధ్ర: జిల్లా పంచాయతీ అధికారి కమలాపురం గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ పనులను తనిఖీ చేసి, పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, కేంద్రం నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అలాగే పెన్సిల్ యాప్‌లో వెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ధృవీకరించారు. సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందించి, పనులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


