కొమురం భీమ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘన నివాళులు

ఇంద్రవెల్లి కేంద్రంలో పూజలు నిర్వహించి పూలమాలలు వేసిన అధికారులు, ఆదివాసీ నాయకులు

కొమురం భీమ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘన నివాళులు

ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీర యోధుడు కొమురం భీమ్‌కు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొమురం భీమ్ ఆశయాలు, ఆదివాసీల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతి, గిరిజనుల హక్కుల పరిరక్షణలో కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీవో సంజీవ్ రావు, కొమురం భీమ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్, కేస్లాపూర్ రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం వెంకటరావు పటేల్, గిన్నేరా రాయిసెంటర్ సార్‌మెడి మెస్రం దుర్గ, ఇంద్రవెల్లి సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఆదివాసీ నాయకులు పూర్కా చిత్రు, కనక తుకారామ్, జుగాదిరావు, గేడం భరత్, సుంకట్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి