స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన చైర్ పర్సన్, తహసీల్దార్

స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేసిన చైర్ పర్సన్, తహసీల్దార్

లక్షేట్టిపేట, :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ ప్రక్రియను సోమవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలోని ఇటిక్యాలలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, తహసీల్దార్ దిలీప్ కుమార్ ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. సమాజంలోని ఏ ఒక్కరూ ఆకలితో బాధపడవద్దని అందరికీ సన్న బియ్యం అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం, కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్స్ అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం పలు వార్డులకు సంబంధించిన రేషన్ కార్డ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఒకటవ వార్డ్ కౌన్సిలర్ బుద్దె సిద్ధార్థ ( బిట్టు ) ఆ వార్డ్ లబ్ధి దారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అందజేశారు.రెండవ వార్డ్ లో కౌన్సిలర్ పెట్టెం తిరుపతి స్మార్ట్ రేషన్ కార్డ్స్ లబ్ధి దారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్,నాయకులు గోళ్ళ కాంతయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు! జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – ప్రజాప్రతినిధులకు సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్ వినతి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే...
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం:
శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు