రోడ్డు ప్రమాద బాధితులకు ఒక లక్ష 50 వేలు ఉచిత నగదు రహిత చికిత్స.

పీఎం రహత్ పథకాన్ని ప్రజలు సిద్ధం చేసుకోండి..... నసురుల్లాబాద్ ఎస్సై సాయి కృష్ణ.......

రోడ్డు ప్రమాద బాధితులకు ఒక లక్ష 50 వేలు ఉచిత నగదు రహిత  చికిత్స.

బాన్సువాడ :  రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 ఉచిత నగదు రహిత చికిత్సను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం నసరుల్లాబాద్ ఎస్సై సాయి కృష్ణ ప్రజలను కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స – పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా ₹1.5 లక్షల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది, పథకం నిబంధనలకు లోబడి. తెలంగాణ రాష్ట్రం లో పీఎం రహత్ కింద 469 ఆసుపత్రులు నమోదు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ప్రైవేట్ ప్రభుత్వ దవాఖానలు కలవు. పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు: 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స, గరిష్టంగా 7 రోజుల వరకు చికిత్స, పథకం నిబంధనలకు లోబడి, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, చికిత్స ఖర్చుల భయంతో వైద్య సహాయం ఆలస్యం చేయకుండా ఉండేందుకు ఉపయోగకరమైన పథకం. ప్రజలకు విజ్ఞప్తి: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే సమీపంలోని అర్హత కలిగిన ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందేలా చూడండి. అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు కాల్ చేయండి. ఈ పథకం గురించి ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి, అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గమనిక: ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్న సిబ్బంది కి * పీఎం- రహత్ * పథకం కింద అడ్మిషన్ చేయమని కోరాలి అని సూచించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌ పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ డీఎస్పీలకు దిశా నిర్దేశం* ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 23...
జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం: