జిల్లా పరిషత్ హై స్కూల్ పాత బాన్సువాడ లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.
బాన్సువాడ : జిల్లా పరిషత్ హై స్కూల్ పాత బాన్సువాడ లో సోమవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత పెడదారి ప్రేమలు - మోసాలు మైనర్ డ్రైవింగ్--మాదక ద్రవ్యాల నిర్ములన--సైబర్ నేరాలు, మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశముల పై కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశాను సారం బాన్సువాడ సి ఐ .తులా శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందంచే అవగాహనా కార్యక్రమం సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930, మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908, షి టీమ్ నం 8712686094, అత్యవసర సమయం లో అన్ని ఎమ్మార్జెనేసి ల కొరకు డైల్ 112 కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియా తో జాగ్రత్త గా ఉండాల ని మంచి లక్ష్యం తో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని మూఢ నమ్మకాలు నమ్మ వద్దు టెక్నాలజీ సైన్స్ ను నమ్మాలని ఎటువంటి చిన్న నేరాలకు పాల్పడవద్ద ని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్, రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ యు. శేషారావు, పి సి .ప్రభాకర్ మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈకార్యక్రమంలో బాన్సువాడ షి టీమ్ పని తీరు మహిళాల కు రక్షణ పట్ల పని చేయు విధానం ఫోక్సో కేసులు గురించి మైనర్ నేరాల పై పి సి.అనిల్, డబ్ల్యూ పిసి. పార్వతి వివరించారు. పాఠశాల హెడ్ మాస్టర్. విజయ్ కుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


