గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
మంచిర్యాల(క్రైమ్), : హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపేట వద్ద సోమవారం లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ యాక్సిల్ (Axle) ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమీపంలోని ఓ పైపుల ఫ్యాక్టరీకి చెందిన ఈ ట్రాక్టర్ ఉదయం నుంచి నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తోందని సమాచారం, అంతేకాక వాహనానికి సరైన నిర్వహణ లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీసి వివరాలు సేకరిస్తున్నారు. .
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


