తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేస్తున్న దొంగలు
తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ..
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో మారవేణి పరశురాములు, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి, సోమవారం ఉదయం 06:00 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళం కూడా పగులగొట్టి, అందులో భద్రపరిచిన సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, 82 తులాల వెండి ఆభరణాలు మరియు నగదు రూ.1,00,000 రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలిపాడు. ఇట్టి విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మారలేని పరుశరాములు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్ బాలరాజు తెలిపారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వార్ తో పాటు ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం వచ్చి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.ఎస్సై ఆర్. బాలరాజు మాట్లాడుతూ, ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రజలను కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


