### జానకంపేట్ కల్లు బట్టిపై ఈగల్ టీమ్ దాడులు.. ఆల్ఫ్రాజోలం కల్తీ నిర్ధారణతో కేసు నమోదు!
నిజామాబాద్ నార్కోటిక్ సీఐ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో తనిఖీలు.. ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
నిజామాబాద్ జిల్లా : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని కల్లు బట్టిపై నిజామాబాద్ నార్కోటిక్ సీఐ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ ఎస్సై సందీప్, ఎడపల్లి మండల పోలీస్ ఎస్సై రమ నేతృత్వంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కల్లు సేవించిన కొందరికి నిర్వహించిన పరీక్షల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కల్లు బట్టిపై దాడులు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలపడం ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, కల్తీ కల్లు తయారీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు, మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తున్న నార్కోటిక్ విభాగం, ఈగల్ టీమ్, స్థానిక పోలీసుల చర్యలు అభినందనీయం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


