ఈనెల26న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా .. మద్దిమడుగు లో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్.
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా ఉన్నతాధికారులు అచ్చంపేటలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
అచ్చంపేట ( నాగర్ కర్నూల్ జిల్లా) : ఈనెల 26వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసే సత్ సేవన్ లాల్ మహారాజ్ గర్భగుడి ఆలయం నిర్మాణం విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పర్యటించనున్న సందర్భంగా సోమవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచ్చుకుల్లా రాజేష్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ బెల్లయనాయక్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరు ఉన్నతా అధికారులు మద్దిమడుగులో ఏర్పాట్లను పరిశీలించారు తో అంతకుముందు మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు సందర్శించుకున్నారు అనంతరం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేటలో జరిగే బహిరంగ సభ సభ స్థలాన్ని కూడా మంత్రి తోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా ఎస్పీ తో పాటు ఉన్నతాధికారులు బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నల్లమల్ల ప్రాంతం మద్దిమడుగు ఆంజనేయస్వామి ప్రాంగణంలో దేవాలయం నిర్మాణం సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి 26వ తేదీన చేపట్టడం జరుగుతుందని అన్నారు గిరిజనుల ఆరాధ్య దైవం సత్ సేవాలాల్ విగ్రహంతో పాటు 20 ఎకరాలలో గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు తొలి విడుదగా 38 కోట్లు అభివృద్ధి పనుల కోసం విడుదల చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సరికొత్త ఉత్సాహం అని ఈ బహిరంగ సభ లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి గిరిజనులు మేధావులు అభిమానులు కుల కులమత బేధాలు పార్టీల పార్టీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


