జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!

జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – ప్రజాప్రతినిధులకు సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్ వినతి

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతిపత్రాలు అందజేత

కూకట్‌పల్లి, నవంబర్ 23 

జర్నలిస్టుల పెన్షన్ హక్కును సాధించే వరకు తన పోరాటం ఆగదని సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతిపత్రాలు అందజేశారు.
సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు వృద్ధాప్యంలో కనీస ఆర్థిక భద్రత లేకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో భాగంగా జర్నలిజం వృత్తిలో కొనసాగిన జర్నలిస్టులకు పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం అందించేందుకు నెలవారీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ నెలవారీ పెన్షన్ అమలు చేయడంతో పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, వారి కుటుంబాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించి, వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం అనేది కేవలం హామీలకే పరిమితం కాకుండా, ఆచరణలో అమలు కావాలని అన్నారు.
జర్నలిస్టుల పెన్షన్ అనేది దయతో ఇచ్చే సాయం కాదు.. ఎన్నో ఏళ్లుగా సమాజానికి సేవలందించిన జర్నలిస్టుల హక్కు. ఆ హక్కు సాధించే వరకు ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తూ, తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తానని మునిపల్లి నరేష్ యాదవ్ స్పష్టం చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు! జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – ప్రజాప్రతినిధులకు సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్ వినతి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే...
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం:
శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు