బండ్లగూడ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ
సొంత నిధులతో రోడ్డు చదును పనులు.. ఐదు రోజులుగా పర్యవేక్షిస్తున్న మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్చెరు : జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడకు వెళ్లే రహదారిపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ తీసుకున్నారు. అక్రమ్ కేఫ్ నుంచి బండ్లగూడ వరకు ఉన్న రహదారిపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలను తన సొంత నిధులతో తొలగిస్తూ రోడ్డు చదును పనులు చేపట్టారు.
ఈ పనులను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గత ఐదు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాల సహాయంతో మట్టి కుప్పలను తొలగిస్తూ రహదారిని చదును చేసే పనులను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బండ్లగూడ ప్రజలు రాకపోకల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారిని మరింత సౌకర్యవంతంగా, విశాలంగా తీర్చిదిద్దేందుకు త్వరలో జీహెచ్ఎంసీ లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు IELAకు సంబంధించిన సుధీర్ రెడ్డి, రంజిత్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


