20వ వార్డులో విద్యుత్ కష్టాలు - ఏఈకి కౌన్సిలర్ వినతి

20వ వార్డులో విద్యుత్ కష్టాలు - ఏఈకి కౌన్సిలర్ వినతి

ములుగు మున్సిపాలిటీ 20వ వార్డులో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్ కొత్త సురేందర్ ములుగు మండల విద్యుత్ ఏఈ రవిని కోరారు.బుధవారం ఏఈని కలిసిన ఆయన, వార్డులో అధిక లోడ్ వల్ల విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. పవర్ పోతే తిరిగి రావడానికి గంటల తరబడి పడుతోందని, లోపం ఎక్కడ వచ్చిందో తెలుసుకోవడం లైన్‌మెన్‌లకు కూడా కష్టంగా మారిందని తెలిపారు.సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.గత పదేళ్ల క్రితం వేసిన విద్యుత్ స్తంభాల కాలపరిమితి ముగిసినా ఇప్పటివరకు కొత్త స్తంభాలు వేయలేదని అన్నారు. తీగల బరువుతో స్తంభాల మధ్య కరెంటు తీగలు కిందికి వేలాడుతూ గాలిలో ఊగుతున్నాయని, మధ్యలో మరో స్తంభం ఏర్పాటు చేయడంతో పాటు కొత్త స్తంభాలు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా కిషోర్ నాయక్, 20వ వార్డు నాయకులు దేవిరెడ్డి ఇంద్రసేనా రెడ్డి, పిట్టల రమేష్, చరణ్, చంటి తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!