మద్దిమడుగులో రూ.71 కోట్లతో మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
నాగర్కర్నూల్ జిల్లా,నేడు మధ్యాహ్నం మద్దిమడుగులో మూడు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.రూ.15 కోట్ల వ్యయంతో శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.రూ.18 కోట్లతో మద్దిమడుగు శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.మొత్తం రూ.71 కోట్లతో మద్దిమడుగు ప్రాంతంలో ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.ఈ అభివృద్ధి పనులతో మద్దిమడుగు ప్రాంతానికి మరింత గుర్తింపు, పర్యాటక ప్రాధాన్యత పెరగనుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


