జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం - రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరహోత్ అలీ
కామారెడ్డి : జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరహోత్ అలీ చెప్పారు. గురువారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ లో జరిగే మహాసభలకు వెళ్తుండగా, ఆయనను కామారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్యూ నియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జర్నలిస్టులు ఆయనకు శాలువా కప్పి, మొక్కను అందజేసి ఘనంగా సన్మానించారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు, పని ఒత్తిడి, వేతన భద్రత వంటి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజానికి నాలుగో స్తంభంగా పనిచేస్తున్నారని, వారి హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతే వారి బలమని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే అవసరమైతే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, జిల్లా కార్యదర్శి తోట రాజేష్, ఐజేయు కార్యవర్గ సభ్యులు, సాక్షి స్టాఫర్ సేపూరి వేణుగోపాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఆబిద్, సయ్యద్ కౌసర్ అలీ, ముదాం శంకర్ పటెల్, వడ్ల సురేష్, వెంకన్న, హరీష్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


