లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు, నగదు అపహరిస్తున్న (5) గురు అంతరాష్ట్ర ముఠా సబ్యుల అరెస్ట్.
ఆపరేషన్ కవాచ్ ద్వారా ముఠా సబ్యులు వారి వాహనం పట్టివేత. - ఒక క్రెటా కారు, 25 రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి :కామారెడ్డి జిల్లా కేంద్రంలో తేదీ 21/22. నవంబర్ .2026 న అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 01:00 గంటల సమయంలో కామారెడ్డి పట్టణంలోని అక్షయ గ్రాండ్ లాడ్జికి 5 గురు వ్యక్తులు వచ్చి రూమ్ కావాలని మాట్లాడిస్తూ డ్యూటీ లో ఉన్న మేనేజర్ను బెదిరించి లాడ్జికి సంబంధించిన రిజిస్టర్లు, రూ.10,000/- నగదు దొంగిలించినారాని పిర్యాదు రాగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో, కామారెడ్డి టౌన్ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీసీటీవీ పూటేజ్ పోలీసులు ఇతర సాంకేతిక సమాచారం ఆదారంగా నేరస్తులను పట్టుకునేందుకు తగు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తేదీ 24. నవంబర్.2026 రాత్రి కామారెడ్డి పట్టణ కేంద్రం ఎంట్రెన్స్ లోని ఆపరేషన్ కవాచ్ వద్ద అనుమనస్పదముగా ఉన్న వాహనంను ఆపి అందులోని వ్యక్తుల వివరాలు అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడముతో అనుమనముతో వారిని, వారి వాహణమును క్షుణ్ణంగా తనికి చేసి విచారించగ అక్షయ గ్రాండ్ లాడ్జి-కామారెడ్డి లో చేసిన నేరం తరహాలోనే మరలా నేరం చేసేందుకు రాగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని అన్నారు .వివరాల్లోకి వెళితే - నిందితులు మాచిఅల్లీ మారుతి అతని సహచరులు చాక్రీ పరుశురాం, అభిషేక్ కవ్వాడి, వెంకటేష్ సత్వాడి, సాటపాడి సంతోష్ అను కర్ణాటక రాష్ట్రంకి చెందిన (5) గురు సబ్యులు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే దానికి గాను వివిధ ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లకు వెళ్లి రూములు కావాలని అడిగి, అక్కడి మేనేజర్లను బెదిరించి, లాడ్జీలలో బస చేసే వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు తదితర వివరాలు కల్గిన రిజిస్టర్లను బలవంతంగా దొంగిలించి ఆ రిజిస్టర్లలోని ఫోన్ నంబర్లకు కాల్ చేసి, సదరు వ్యక్తులు గతంలో ఆయా లాడ్జీలలో బస చేసిన తేదీలు, సమయాలు, ఆధార్ కార్డు వివరాలు తదితర సమాచారాన్ని తెలియజేస్తూ, వారికి పరిచయస్తులుగా నమ్మకం కలిగించి, కర్ణాటక రాష్ట్రంలో తక్కువ ధరకు బంగారం లభిస్తుందని చెప్పి మొదట అసలు బంగారాన్ని శాంపిల్గా చూపించి, అనంతరం కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయాలని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేయడం నేర ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఈ పథకంలో భాగంగా నిందితులు కర్ణాటక రాష్ట్రం నాగరాజు అనే వ్యక్తి వద్దనుండి టూర్ కి వెళ్తున్నామని చెప్పి అద్దెకు తీసుకున్న క్రెటా కారులో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి జోగుళాంబ గద్వాల జిల్లాలోని హోటల్ గీత లాడ్జి, జడ్చర్లలోని అతిథి డీలక్స్ లాడ్జి, హోటల్ సితార లాడ్జి, షాద్నగర్లోని శ్రీ బాలాజీ లాడ్జి, కొత్తూరులోని OYO రెసిడెన్సీ లాడ్జి, హైదరాబాద్ చందానగర్లోని ఎస్.ఎస్.ఆర్. లగ్జరీ లాడ్జి, శ్రీ సుప్రజా లాడ్జి, సంగారెడ్డిలోని శ్రీ సాయికృష్ణ లాడ్జి, మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ హోటల్ తదితర ప్రాంతాల్లోని లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లను బలవంతంగా దొంగిలించినారు. తేదీ 21.11.2026 అర్ధరాత్రి దాటిన తరువాత కామారెడ్డి పట్టణంలోని అక్షయ గ్రాండ్ లాడ్జికి వెళ్లి మేనేజర్ను బెదిరించి రూ.10,000/- నగదు లాడ్జికి సంబంధించిన రిజిస్టర్లను దొంగిలిచారు. మేనేజర్ వారిని అడ్డుకొని ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్ చూపించి కారుక్రింద పడేసి చంపుతామని బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు. దొంగిలించిన రూ.10,000/- నగదును అందరూ సమానంగా పంచుకున్నారు అని దర్యాప్తులో తేలింది.నిందితుల వివరములు:A1 – మాచిహళ్లి మారుతి, తండ్రి: ప్రభు, 32 సం.లు, మాచిహళ్లి కొరచరహట్టి గ్రామం, A2 – చక్రి పరశురామ్ మాదిగ,తండ్రి: బసవరాజ్, 25 సం.లు, ఆదివిహళ్లి గ్రామం, A3 – అభిషేక్ కవ్వాడి, తండ్రి వెంకటేష్, 21 సం.లు, బతనహళ్లి గ్రామం, A4 – వెంకటేష్ సట్పాడి, తండ్రి దేవేంద్రప్ప, 25 సం.లు, హుచ్చవనహళ్లి గ్రామం, A5 – సంతోష్ సట్పాడి లక్ష్మప్ప, తండ్రి లక్ష్మప్ప, 32 సం.లు, బతనహళ్లి గ్రామం, A1 to A5 విజయనగర జిల్లా (హోస్పేట్), కర్ణాటక రాష్ట్రం కు చెందిన వారు.స్వాధీనపు వివరములు:1) నగదు రూ.8,500/-, 2) నేరానికి ఉపయోగించిన క్రెటా కారు, రిజిస్ట్రేషన్ నంబర్ KA 05 ND 8238, 3) ఒక స్క్రూడ్రైవర్, 4) 25 రిజిస్టర్లు, 5) నకిలీ బంగారు బిస్కెట్లు (10 తులాలు, 2 తులాలు, 1 తులం మరియు అర తులం బరువుగల ఒక్కొక్క బిస్కెట్ 6) నిందితులు నేరానికి ఉపయోగించిన 5 మొబైల్ ఫోన్లు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో ఉన్న వ్యక్తుల వివరాలను ఉపయోగించి మరిన్ని మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, నిందితుల నేర పద్ధతులు, ఇతర నేరాల్లో వారి ప్రమేయం, మిగిలిన నిందితుల ఆచూకీ తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఆపరేషన్ కవాచ్ నందు చాకచక్యముగా వ్యవహరించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 గురు ముఠా సబ్యులను పట్టుకున్న దర్యాప్తు అధికారి మరియు సిబ్బంది సాయిలు ARSI, భాను, రాహుల్, శుండాల సింగ్, పీర్య కానిస్టేబుల్ మరియు మల్లేష్ హోమ్ గార్డ్ గార్లను ఎస్పీ అభినందించి, నగదు రివార్డ్ లను అందజేశారు.కామారెడ్డి జిల్లా పోలీసుల విజ్ఞప్తి -
ప్రజలు తక్కువ ధరకు బంగారం ఇస్తామని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు విలువైన వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి, మోసపోయి డబ్బులు చెల్లించవద్దు. అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ వివరాలు లేదా గత ప్రయాణ వివరాలు తెలియజేసి నమ్మకం కలిగించినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసపూరిత కార్యకలాపాలు మీకు గాని, మీకు తెలిసిన వారికి జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఆన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Nov 2026 19:19:01
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ; సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
