హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతృత్వంలో  బతుకమ్మ వేడుకలు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతృత్వంలో  బతుకమ్మ వేడుకలు

హన్మకొండ న్యూస్ :   బతుకమ్మ సంబురాలు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం అంగరంగ వైభవంగా  జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మహిళా ఉద్యోగినిలు పెద్ద సంఖ్యలో హాజరై తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో  సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభోపీతంగా,మహిళల బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎన్పీడీసీఎల్ సిఎమ్ డి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి(రెవెన్యూ), శేషాద్రి( స్థానిక సంస్థలు), ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి హాజరైనారు. మహిళా ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి బతుకమ్మ ఆటపాటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా  వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ* బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ వవిశిష్టమైన సాంస్కృతిక వారసత్వంను భావితరాలకు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యంత వైభవంగా హనుమకొండ కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నరని పేర్కొంటూ జిల్లాలోని అధికారులకు, ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు.అన్నీ బతుకమ్మ లు చాలా బాగున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలోని  ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్పీడీసీఎల్ సిఎమ్ డి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ  జిల్లా  లోని అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళా శక్తికి ఆత్మగౌరవానికి ప్రతీక  బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, అధికారులు ,ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
 జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ సాంప్రదాయం తెలిపే పండుగలను ఉద్యోగ సంఘాల నేతృత్వంలో జరుపుకోవడం అత్యంత ఆనందకరం అని పేర్కొంటూ కలెక్టర్  నేతృత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే విధంగా బతుకమ్మ పండుగ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అత్యంత  తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు కలెక్టర్  చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.డిఆర్డిఏ  మొదటి బహుమతి, ,రెండవ బహుమతి ఐ సి డి ఎస్, మూడవ బహుమతి కలెక్టరేట్ రెవెన్యూ, స్పెషల్ ప్రైజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ లకు లభించాయి. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాస్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, సి పి ఓ సత్యనారాయణ రెడ్డి ,ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్,పనికల రాజేష్,జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, శ్యాంసుందర్ ,మాధవరెడ్డి, రాము నాయక్,శ్రీనివాస్ రెడ్డి, జయంతి,శ్రీలత, నాగరాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
* చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి * గ్రామీణ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం * నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా....
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి
ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ
భక్తి కంటే ముక్తి - మెట్టు లక్ష్మన్
కొమురం భీమ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఘన నివాళులు
నీరు లేక వెలవెలబోతున్న మంజీరా ప్రాజెక్టు!